
చిన్న పత్రికల ఎంపానెల్‌మెంట్ అడ్డంకులు తొలగించాలి: NARA డిమాండ్
అమరావతి: ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం మీడియా అంటారు. కానీ ఆ నాలుగో స్థంభానికి ఇప్పుడు మూగబోయేటట్లు చేస్తుంది ఎవరు.? ప్రభుత్వమా? లేక —సమాచార శాఖలోని కొందరు అధికారులు సృష్టించిన చట్టం లేని జీవోలేనా?
స్మాల్ సర్కులేషన్ కలిగిన అన్ని పత్రికలకు ఎంపానెల్‌మెంట్‌తో సంబంధం లేకుండా స్టేట్ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ సమాచార & ప్రజా సంబంధాల శాఖపై ఉందని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలకు శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుందని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడేషన్ కలిగి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా కవర్ చేసిన స్మాల్ సర్క్యులేషన్ పత్రికలకు ఎంపానెల్‌మెంట్‌తో సంబంధం లేకుండా స్టేట్ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై ఆంధ్రప్రదేశ్ సమాచార & ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ను గతంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు కలసి స్మాల్ సర్క్యులేషన్ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులు వినతి పత్రం అందజేసి ఇటీవల అమలులోకి తెచ్చిన ఎంపానెల్‌మెంట్ నిబంధనల వల్ల వందలాది చిన్న పత్రికలు, వేలాది జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితిని డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది.
*⚖️ లీగల్ పాయింట్ – స్పష్టం*
RTI చట్టం, ప్రెస్ ఫ్రీడమ్, ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రెస్ స్వేచ్ఛను పరిమితం చేసే ఏ నిర్ణయం అయినా చట్టపరమైన ఆధారం కలిగి ఉండాలి. ఏ జీవోలోనూ, ఏ కేంద్ర మార్గదర్శకాల్లోనూ, ఏ నోటిఫికేషన్‌లోనూ “ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ ఇవ్వకూడదు” అనే నిబంధన లేదు. అలాంటి నిబంధనను అమలు చేయడం అంటే — చట్టాన్ని మీరే తయారు చేసుకున్నట్లే, విధివిధానాలను ఉల్లంఘించినట్లే, కోర్టుల ముందు నిలబడాల్సిన పరిస్థితి తేవడమే.
*🛑 ఎంపానెల్‌మెంట్ = అక్రిడేషన్ అనే నిబంధనకు చట్టపరమైన ఆధారం లేదు*
ప్రభుత్వ ప్రకటనల కోసం ఎంపానెల్‌మెంట్ అవసరం కావచ్చు. కానీ — “ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ ఇవ్వకూడదు” అనే నిబంధన ఏ జీవోలోనూ లేదు. కేంద్ర మార్గదర్శకాలలోనూ లేదు. గతంలో ఎప్పుడూ అమల్లో లేదు ఇది పూర్తిగా అధికారులు స్వయంగా సృష్టించిన నియమంగా మారి, తక్కువ సర్కులేషన్ కలిగిన పత్రికలు, అమాయక జర్నలిస్టులపై భారంగా మారిందని NARA స్పష్టం చేసింది.
*📰 చిన్న పత్రికలే ప్రజాస్వామ్యానికి బలం*
దేశంలో మీడియా పరిసరాలు మారుతున్నప్పటికీ — గ్రామీణ, పట్టణ స్థాయిలో, దిన, వార, పక్ష, మాస పత్రికలుగా ప్రజా సమస్యలను నిత్యం వెలుగులోకి తెస్తున్న స్మాల్ సర్క్యులేషన్ పత్రికలు ప్రభుత్వ సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేసింది.
ఏళ్ల తరబడి స్టేట్ అక్రిడేషన్‌తో సేవలందించిన పత్రికలు, కేవలం ఎంపానెల్‌మెంట్ లేదనే కారణంతో అక్రిడేషన్‌కు దూరమవడం మీడియా వ్యవస్థ బలహీనపడే ప్రమాదకర సంకేతమని హెచ్చరించింది.
*🔴 మెయిన్ డిమాండ్:*
*✊ స్మాల్ సర్కులేషన్ పత్రికలకు ఎంపానెల్‌మెంట్‌తో సంబంధం లేకుండా స్టేట్ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి:*
ఈ సందర్భంగా NARA పలు కీలక డిమాండ్లు ఉంచింది:
గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడేషన్ కలిగిన పత్రికలను ప్రత్యేకంగా పునఃపరిశీలించాలి. పత్రికల సుదీర్ఘ అనుభవం, విశ్వసనీయత, గత కథనాల ఆధారంగా అక్రిడేషన్ ఇవ్వాలి. ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడేషన్ షరతుగా వెంటనే తొలగించాలి. సర్కులేషన్ ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కనీసం రెండు అక్రిడేషన్లు మంజూరు చేయాలి. ఎంప్యానల్మేంట్, పబ్లికేషన్ సెంటర్‌తో సంబంధం లేకుండా ఎడిటర్ లందరికీ స్టేట్ అక్రిడేషన్ లు ఇవ్వాలి.
*✊ ఉద్యమం కొనసాగుతుంది:*
ఇప్పటికే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, డైరెక్టర్‌లను NARA పలుమార్లు కలిసి — స్మాల్ సర్కులేషన్ పత్రికలకు ఎంపానెల్‌మెంట్‌తో సంబంధం లేకుండా స్టేట్ పాసులు, స్టేట్ అక్రిడేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తోంది. దాని ఫలితంగా ఉమ్మడి జిల్లాల్లో పబ్లికేషన్‌తో సంబంధం లేకుండా ఆర్గనైజేషన్ వివరాలు అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినా — ఇది పూర్తి పరిష్కారం కాదని, స్టేట్ స్థాయిలో అక్రిడేషన్ మంజూరు చేసే వరకు పోరాటం ఆగదని NARA స్పష్టం చేసింది.
*✊🔥 ఉద్యమ పిలుపు – జర్నలిస్టులారా మేల్కొనండి*
ఇది ఒక సంఘం సమస్య కాదు.
ఇది ఒక పత్రిక సమస్య కాదు.
👉 ఇది ప్రతి జర్నలిస్టు హక్కు
👉 ఇది ప్రెస్ స్వేచ్ఛ ప్రశ్న
👉 ఇది ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమం
*@-స్మాల్ సర్కులేషన్ పత్రికల గొంతు నొక్కితే – ప్రజల గొంతు నొక్కినట్టే.*
✊ తరలిరండి
✊ ఏకమవండి
✊ హక్కుల కోసం పోరాడండి
*@-న్యాయం జరిగే వరకు NARA ఉద్యమం ఆగదు. తాడో పేడో తేల్చుకుందాం.*