logo

అంబేద్కర్ మార్గంలో నడుద్దాం రాజ్యాంగ హక్కులకై నిలుద్దాం: కరపత్రాల ఆవిష్కరణ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ రైట్స్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాలను విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మరియు ఎస్.కోట మాజీ శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాసరావు విజయనగరం ధర్మపురిలోని క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు:
ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రెడ్ బుక్ అమలు చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, కానీ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 ద్వారా మెడికల్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి పేదలకు వైద్యాన్ని దూరం చేస్తోందని ఆరోపించారు.
గత ప్రభుత్వ విజయాల ప్రస్తావన:
2019-2024 మధ్య కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. విజయవాడలో రూ. 404 కోట్లతో 19 ఎకరాల్లో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
*పాల్గొన్న ముఖ్యులు*
ఈ కార్యక్రమంలో వేపాడ మండల పార్టీ అధ్యక్షుడు జగ్గు బాబు, అంబేద్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను మూర్తి, కార్పొరేటర్ బోనేల ధన లక్ష్మి, బుధరాయవలస మధు, ధారన వెంకటేష్, సోము లక్ష్మణరావు, పొట్నూరు చంద్ర శేఖర్, గాలి భాస్కర్ రావు, నిమ్మకాయల సుగుణాకర్, వేముల వంశీ, పొట్నూరు కేశవ, దుక్క కృష్ణవేణి, ఆదాడ శ్రీను, డోల కోటేశ్వరరావు, గొర్ల దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

12
983 views