logo

సర్పంచ్‌ గెలిచిన సంబరాల్లో యువతిపై అత్యాచారం యువతి మృతి.. గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్లు అనుమానం”*

జర్నలిస్టు: మాకోటి మహేష్

*“సర్పంచ్‌ గెలిచిన సంబరాల్లో యువతిపై అత్యాచారం యువతి మృతి.. గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్లు అనుమానం”*

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామం సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాల నడుమ ఘోర విషాదానికి వేదికైంది. బుధవారం అర్ధరాత్రి జరిగింది ఒక 22 ఏళ్ల యువతిపై అత్యాచారం. తర్వాత ఆమె రక్తస్రావంతో మృతిచెందిన ఘటన గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

*రైతు వేదికకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు*

సర్పంచ్ గెలిచిన ఆనందంలో గ్రామం పాటలు, కేకలు, బాణాసంచా సంబరాల్లో మునిగిపోయిన సమయంలో విష్ణు అనే యువకుడు ఆ యువతిని రైతు వేదిక కు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడే ఆమెపై అత్యాచారం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

*స్పృహ కోల్పోయింది ‘సౌండ్‌తో పడిపోయింది’ అని నాటకం*

అత్యాచారంతో యువతి తీవ్రమైన రక్తస్రావానికి గురై స్పృహ కోల్పోయిన తర్వాత, విష్ణు ఆమె తల్లికి ఫోన్ చేసి,
“సౌండ్ ఎక్కువగా ఉండడంతో మీ అమ్మాయి కుప్పకూలిపోయింది”
అని అబద్ధ కథ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

*ఆర్ఎంపీ–గవర్నమెంట్ ఆసుపత్రి అప్పటికే చనిపోయింది*

అవసరమైన ఏర్పాట్ల పేరుతో విష్ణు, యువతి తల్లితో కలిసి మొదట స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుండి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే యువతి మరణించినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి రైతు వేదిక వద్దకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

*ఉదయం గ్రామస్తులు చూసిన దృశ్యాలు అనుమానాలు పెరిగిన గ్యాంగ్ రేప్ కోణం*

ఉదయం గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా రక్తపు మరకలు, చించబడిన దుస్తులు, అలజడి జాడలు కనిపించాయి. దీనితో ఒక్క వ్యక్తి చేత కాదు ఒకటి కంటే ఎక్కువ మంది కలిసి అత్యాచారం చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*పోలీసుల చర్య ..ఒకరిని అదుపులోకి*

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, ఫోన్ రికార్డులు ఆధారంగా గ్యాంగ్‌రేప్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

*గ్రామంలో ఆగ్రహం కఠిన చర్యల డిమాండ్*

ఈ సంఘటనతో వేముల గ్రామంలో ఉద్రిక్తత చెలరేగింది. మహిళలు, యువత ఎన్నికల సంబరాలు లైంగిక నేరాల వేదికగా మారకూడదని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

*ఒక కుటుంబాన్ని కూల్చేసిన ఈ దారుణం....గ్రామంలో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.*

2
14 views