logo

ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా టీ జీ టీ డబ్ల్యూ ఆర్‌ డీ సీ పాల్వంచ లో ఈ రోజు (శనివారం)జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **పాల్వంచ పట్టణం** డిసెంబర్ 20**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)



టీ జీ టీ డబ్ల్యూ ఆర్‌ డీ సీ పాల్వంచ లో ఈ రోజు (శనివారం)జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది ఇ సెమినార్ లో ముఖ్య అతిధిలుగా :పి. అజయ్ కుమార్ మేనేజర్, TGREDCO
G. మహేందర్ S.E(ఆపరేషన్స్) TGNDPCL భద్రాద్రి కొత్తగూడెం, డాక్టర్ జి. పాల్ దేవదానం ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ,యెమ్మిగనూర్, కర్నూలు ఏపీ. పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు తెలుపుతూ
అంశం : విక్షిత్ భారత్ 2047 కోసం శక్తి పరిరక్షణ మరియు స్థిరత్వం.

Topic : Energy conservation and sustainability for viksit bharath 2047

.ఇంధన పొదుపు వారోత్సవాలు అంటే విద్యార్థులు కు విద్యుత్, ఇంధన పొదుపు ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, దీనికోసం జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తోంది, ఇందులో భాగంగా ర్యాలీలు, పోస్టర్ విడుదలలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తూ 5 స్టార్ రేటింగ్ పరికరాలు, LED లైట్లు వాడటం, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం వంటివి ప్రోత్సహిస్తున్నారు.
ముఖ్య ఉద్దేశ్యం ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం అంటే రెండు యూనిట్లు ఉత్పత్తి చేయడంతో సమానం అని, విద్యుత్ పొదుపు వల్ల ఇంధనం ఆదా అవుతుందని అవగాహన కల్పించడం.భవిష్యత్ తరాలకు వెలుగునివ్వడానికి ఇంధన పొదుపు మనందరి సామాజిక బాధ్యత అని తెలియ చేసారు .
కళాశాల ప్రిన్సిపాల్ పి.అనురాధ, వైస్ ప్రిన్సిపాల్ ఆర్ సంగీత, ఏవో రాంబాబు, ఫిజిక్స్H.o.d జి సునీత, కె.మానస కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

78
2722 views