logo

సుజాతనగర్ హరిజన వాడ లో ఉదయం కరెంటు కట్ *విద్యుత్ అధికారుల వైఖరిపై గ్రామస్తుల ఆగ్రహం,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** సుజాతనగర్ మండలం**డిసెంబర్ 20**(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


సుజాతనగర్ హరిజన వాడ లో ఉదయం కరెంటు కట్

*విద్యుత్ అధికారుల వైఖరిపై గ్రామస్తుల ఆగ్రహం,


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని హరిజనవాడ గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు 5.30 గంటలకు విద్యుత్ అధికారులు అకస్మాత్తుగా కరెంటు సరఫరాను నిలిపివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ముందస్తు సమాచారం లేకుండా గ్రామం మొత్తానికి కరెంటు కట్ చేయడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో కొద్దిమంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించలేదన్న కారణంతో మొత్తం గ్రామానికే విద్యుత్ సరఫరా నిలిపివేయడం అన్యాయమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కరెంటు లేక ఉదయం వేళ తాగునీరు, వంట, వ్యవసాయ పనులు, పిల్లల చదువులు తీవ్రంగా అంతరాయం కలిగాయని వారు వాపోతున్నారు.

కరెంటు కట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే సబ్స్టేషన్‌కు ఫోన్ చేయగా అక్కడి అధికారులు స్పందించారని, అనంతరం సంబంధిత ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) గారికి సమాచారం అందించగా అక్కడి నుంచీ కూడా స్పందన వచ్చిందని తెలిపారు. అయితే, సుజాతనగర్ పరిధిలోని జూనియర్ లైన్మెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెత్తనం చలాయిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి.

ప్రత్యేకించి హరిజనవాడ వంటి గ్రామాలపై విద్యుత్ అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉందని గ్రామ పెద్దలు తెలిపారు. బిల్లులు చెల్లించని వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, అందుకు భిన్నంగా నిర్దోషులైన గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనపై గ్రామస్తులు ఏకగ్రీవంగా స్పందిస్తూ,
> “ఇలాంటి ఆలోచనలు, వైఖరులు వెంటనే మార్చుకోవాలి.
ప్రజాసేవలో ఉన్న అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి”అని డిమాండ్ చేశారు.
తక్షణమే ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నరు

33
1383 views