logo

కోనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో,పోలియో చుక్కలు గూర్చి అవగాహన సదస్సు

కోనూరు( గరివిడి): ఈరోజు మండలంలోని కోనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. దేశ వ్యాప్తంగా ఈ నెల 21 ఆదివారం జరగబోయే పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతం చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్.రాంసుందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కోనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి.విష్ణుబాలాజీ గారు మాట్లాడుతూ వాక్సినేషన్ విధానం, చుక్కలు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు..ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలు అందరికీ చుక్కల పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. తదుపరి ఇంకా మిగిలి వున్న పిల్లలకు ఇంటింటికీ వెళ్లి వాక్సినేషన్ ఇవ్వాలని తెలియచేశారు.వాక్సినేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో L.అప్పలనాయుడు గారు(mph e.o), p.వెంకట్ నాయుడు(hs), ఉమామహేశ్వరరావు (h.ast) మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

11
3978 views