logo

"ఫైళ్లపై వేగం, ప్రజలకు అందుబాటులో యంత్రాంగం.. కలెక్టర్ల సదస్సు నిర్ణయాలపై లోక్ సత్తా హర్షం"


కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:
ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 200 కోట్లు ఖర్చు చేసే అధికారం కల్పించడం మరియు ఫైళ్ళపై వేగంగా స్పందించడం శుభపరిణామం.
అధికారాలను కింది స్థాయికి బదిలీ చేయడం ద్వారా పాలన ప్రజలకు చేరువవుతుందని, ఇది లోక్ సత్తా ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో ప్రతిపక్షాల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
అధికారులు ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆదేశాలను స్వాగతించారు.
భూ వివాదాల్లో నేరాలను అరికట్టేందుకు అడ్వకేట్ కమిషనర్ ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు.

0
77 views