logo

డిజిటల్ న్యాయం ఈ- ఫైలింగ్ వాటిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి.

నంద్యాల (AIMA MEDIA): డిజిటల్ న్యాయపాలన వల్ల వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అందువల్ల విద్యార్థులు డిజిటల్ పాలన, ఈ ఫైలింగ్ వాటిపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పౌర సరఫరాల అధికారి, నంద్యాల జిల్లా వారు పేర్కొన్నారు. శుక్రవారం సాయంకాలం నంద్యాల St. జోసెఫ్ హైస్కూల్ నందు ప్రధాన అధ్యాపకులు శ్రీమతి రాగిణి అధ్యక్షతన వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని డిశెంబరు 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి వారోత్సవాలలో భాగంగా నంద్యాల St. జోసెఫ్ హైస్కూల్ నందలి విద్యార్థిని విద్యార్థులకు డిజిటల్ పాలన వ్యవస్థ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి, జె. రవిబాబు మరియు జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అమీర్ బాష, నంద్యాల St. జోసెఫ్ హైస్కూల్ ప్రధాన అధ్యాపకులు శ్రీమతి రాగిణి మరియు సదరు హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నంద్యాల జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అమీర్ బాష ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ న్యాయం అంటే ఇ-కోర్టులు, వర్చువల్ విచారణలు, ఈ-ఫైలింగ్ వంటి సాంకేతికతల ద్వారా కేసులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రధాన అధ్యాపకులు శ్రీమతి రాగిణి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై మరియు కన్జ్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.నంద్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి, జె. రవిబాబు మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువులు నాణ్యతలో లోపం గాని, కొలతలలో తేడా గమనించినట్లయితే వెంటనే అధికారులను కలిసి ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చు, అలా పరిష్కారం కానీ ఫిర్యాదుల పైన వినియోగదారుడు జిల్లాస్థాయి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమీషన్లో ఫిర్యాదు చేసి న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

4
109 views