ఖమ్మం కారేపల్లిలో లంచం వివాదం: రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడి అరెస్ట్..!!*
జర్నలిస్టు : మాకోటి మహేష్
ఖమ్మం జిల్లా కారేపల్లిలో అవినీతి ఘటన వెలుగుచూసింది. కుటుంబసభ్యుల సర్టిఫికేట్ జారీకి రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీ బృందానికి చిక్కారు.
ఫిర్యాదుదారుడి సమాచారంతో ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆపరేషన్ నిర్వహించింది. ఒప్పుకున్న మొత్తాన్ని స్వీకరించే సమయంలోనే ఇన్స్పెక్టర్‌ను రంగెహస్తంగా పట్టుకొని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపారు.
సర్టిఫికేట్ ప్రాసెస్‌ను వేగవంతం చేయాలని కోరగా, దానికి బదులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉండటంతో ఏసీబీ ఘటనా స్థలంలోనే సాక్ష్యాలను సేకరించింది. ప్రస్తుతం అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రజల పనులు చేయాల్సిన అధికారులే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్ల స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై రెవెన్యూ శాఖలో అవినీతిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..!!