logo

రోలుగుంటలో హిందూ సమ్మేళనం 25న

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఖండ పరిధిలోని రోలుగుంటలో ఈ నెల 25న హిందూ సమ్మేళనం భవ్యంగా జరగనుంది. భారతదేశానికి ఆత్మగా నిలిచిన హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, మరియు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరచడమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చివరి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
సంఘం స్థాపనకు శతాబ్ది దిశగా కొనసాగుతున్న ఈ వేడుకల్లో భాగంగా హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మతా భావన, స్వధర్మం పట్ల అంకితభావం పెంపొందించాలన్న ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనం చేపడుతున్నారు. దక్షిణామూర్తి మిల్లు (పాలకేంద్రం) వద్ద, ఓల్డ్ గ్రామీణ బ్యాంక్ సమీపంలో సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ సహ ధర్మజాగరణ ప్రముఖ్ ఆలె శ్యాం కుమార్ గారు ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించనున్నారు.
కులాలు, ప్రాంతాలు, పార్టీలు వేరైనా మనమంతా హిందువులమే అనే భావనతో జీవిస్తూ దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాలను కాపాడుకుందాం అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
వివరాలకు సంప్రదించవచ్చు: శ్రీ దేముడు (91775 84116).

6
423 views