logo

మర్యాదపూర్వకంగా ఎస్సైని కలిసిన హెచ్ఆర్సీఐ సభ్యులు

గుంటూరు జిల్లా కొల్లిపర
పోలీస్‌ స్టేషన్‌కు కొత్తగా నియమితులైన ఎన్ సి ప్రసాద్ నాయుడు సబ్‌-ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు. జాతీయ ప్రధాన కార్యదర్శి మాదాసు చారేంద్ర సూచనల మేరకు మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ వైస్ ప్రెసిడెంట్ కందుల చందు సలహాలు మేరకు గుంటూరు జిల్లాలోని హెచ్ఆర్సిఐ కుటుంబ సభ్యులు ఎస్సై ప్రసాద్ నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కోన వరలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సేవ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, న్యాయపరమైన ధోరణితో పనిచేసే అధికారిగా ప్రసాద్ నాయుడుకి ఇప్పటికే మంచి పేరు ఉంది అని అన్నారు.మండలం లో శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా పోలీస్ సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని ప్రసాద్ నాయుడు తెలియజేశారన్నారు. కొల్లిపర మండల ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు ఆయన నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో శాంతి-భద్రతలు మరింతగా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

3
26 views