logo

కాకతీయ యువ క్రీడోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ

విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల వేడుకలలో భాగంగా, కాకతీయ యువ క్రీడోత్సవాలను వ్యాయామ కళాశాల, స్పోర్ట్స్ బోర్డ్ సహకారంతో విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థుల కోసం డీన్, స్టూడెంట్ అఫైర్స్ నిర్వహిస్తున్నట్లు ప్రో. మామిడాల ఇస్తారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కేయూ యువ క్రీడోత్సవాల బ్రోచర్‌ను బుధవారం వీసీ చాంబర్లో కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రో. కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో. మామిడాల ఇస్తారి, వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ డా. భాస్కర్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రో. వెంకయ్యలు, పాలక మండలి సభ్యులు డా చిర్ర రాజు లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వీసీ ప్రో. ప్రతాప్ రెడ్డి, ప్రో.వి. రామచంద్రం లు మాట్లాడుతూ, “క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, నాయకత్వ లక్షణాల పెంపుకు కీలకమని, కేయూ స్వర్ణోత్సవాల వేడుకల్లో భాగంగా యువ క్రీడోత్సవం విద్యార్థులలో క్రీడాస్ఫూర్తి, జట్టు భావన, ఆరోగ్యకరమైన పోటీ మనస్తత్వాన్ని పెంపొందిస్తుందని” అన్నారు.

డీన్, స్టూడెంట్స్ ఎఫైర్స్ ప్రో మామిడాల ఇస్తారి మాట్లాడుతూ, ఈ యువ క్రీడోత్సవం ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందించడమే కాకుండా విద్యార్థులకు క్రీడల ద్వారా సమగ్ర అభివృద్ధి కల్పించడం, సమాన అవకాశాలు ఇవ్వడం, మరియు విశ్వవిద్యాలయం విలువలను ప్రతిబింబించేలా ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని అన్నారు. క్రీడలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక చైతన్యానికి, మరియు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడతాయని అన్నారు.

ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్ (పురుషులు), వాలీబాల్ (పురుషులు & మహిళలు), 400 మీటర్ల పరుగులు (మహిళలు), 800 మీటర్ల పరుగులు (పురుషులు), మరియు ఖో-ఖో (మహిళలు) వంటి వాటిలో కేయూ క్యాంపస్ లోని, సుబేదారి, హన్మకొండ లో ఉన్నటువంటి కేయూ అనుబంధ పీజీ కళాశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించబడతాయనీ అన్నారు. ఈ పోటీలు జనవరి 12 నుండి 23 వరకు జరుగుతాయనీ, జట్ల పేర్లను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 5 గా నిర్ణయించామని తెలిపారు. అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులు తమ జట్లను డీన్, స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుందనీ అన్నారు.

4
1128 views