logo

తెలంగాణ భవన్ హైదరాబాద్ BJP నుండి BRS లోకి చేరిక

బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ గారి అధ్యక్షత న ఈ రోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమం లో గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా బిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరిన ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎంపీపీ లు నూతన సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు

ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపి గడ్డం రవి గారు అలాగే సిరికొండ మాజీ ఎంపీపీ అమృత్ రావు జన్నారం మండల కార్మిక నాయకులు ముల్కల రాజారామ్ ,
కడం పెద్దూర్ సర్పంచ్ విజయ్ గారు పోచంపల్లి సర్పంచ్ కొడప రాజు , జాదవ్ అజయ్ , సాయి కుమార్ , బోనగిరి దేవేందర్ నూతన సర్పంచ్ లు BRS పార్టీలో . కేటీఆర్ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు KT రామారావు మాట్లాడుతూ.అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. కొద్ది ఓట్ల తేడాతో గెలుపు చివరి అంచు వరకు పోరాడిన గులాబీ సైనికులు అధైర్య పడవద్దు అని సూచించారు.

భవిష్యత్తు అంతా మనదే... ఖానాపూర్ నియోజకవర్గం ప్రజల గుండెల్లో గులాబీ జెండాకీ ప్రత్యేక స్థానం, అభిమానం ఉందనడానికి గెలిచిన మన పార్టీ సర్పంచులు, వార్డుసభ్యులే నిదర్శనం అని చెప్పొచ్చు. అన్నారు .

ఖానాపూర్, కడం, పెంబి దస్తూరబాద్, జన్నారం, ఉట్నూర్, సిరికొండ ఇంద్రవెల్లి,మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన బలగం ఉంది. ప్రజల ఆదరణ పెద్ద ఎత్తున కలిగి ఉంది, అందుకు నిదర్శనమే నూటికి అరవై శాతం ఫలితాలు సాధించగలిగాం.

54 గ్రామపంచాయతీలను సొంతం చేసుకున్నాం, అని స్వతంత్ర సర్పంచ్ లు కూడా ఈ రోజు BRS పార్టీ లో చేరడానికి వచ్చారన్నారు.. చాలా వరకు గ్రామపంచాయతిలు ‘’10 నుండి 15ఓట్లతో’’ సర్పంచ్ స్థానాలు కోల్పోయాం.అని
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. తెలియజేశారు.

ఎన్నికలంటే గెలుపోటములు సహజం.కానీ ఫలితాల నుంచి విశ్లేషణలతో పాఠం నేర్చుకొని.. మళ్లీ కొత్త పోరాటానికి సిద్ధం కావడం యోధుల లక్షణం. అందుకే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన.. మరియు ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు.. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు, సహకరించిన ప్రజలు ఎవరూ కూడా ఆవేదన చెందవద్దు. ఎందుకంటే ఎన్నికలంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. అన్నింటిని అధిగమించి ప్రజల మనసు గెలుచుకోవడం ముఖ్యం.

అందుకే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభిమానాలు మరింతగా పొందాల్సిన బాధ్యత మనకు ఉంది.

ముఖ్యంగా పార్టీ పరంగా గెలిచిన సర్పంచులు,వార్డు సభ్యులు ప్రజలు మన పార్టీపై మనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా.. గ్రామాల ప్రజలకు శక్తి వంచన లేకుండా సేవ చేయాలి. వారికీ కష్టాల్లో తోడుగా ఉండి.. సమస్యలను పరిష్కరించి.. సంతోషంలో భుజం తట్టి ప్రోత్సహించాల్సిన కర్తవ్యం మనపై ఉంది. అలాగే ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన చెందవద్దు.ప్రజల అభిమానం మరింతగా చూరగొనేందుకు ప్రయత్నం చేయాలి.మనల్ని అభిమానించి గెలుపు అంచు వరకు తీసుకొచ్చిన ప్రజలకు అండగా నిలబడాలి.వారి రుణం తీర్చుకునేందుకు.. పార్టీ పరంగా వారికోసం కొట్లాడాలి. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. భవిష్యత్తు గులాబీ జెండాదే అన్న వాస్తవం.. అందరికీ అవగతమవుతుంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులు,వార్డు సభ్యులకు మద్దతుగా నిలిచి ఓటేసి ఆదరించిన ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

16
1268 views