మదనాపురంలో బాంబుల మోత – గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటం!
మదనాపురం గ్రామ పరిధిలో అక్రమ రాళ్ల తవ్వకాలు హద్దులు దాటుతున్నాయి. పంటభూములకు ఆనుకుని బాంబులు ఉపయోగించి రాళ్లను పేల్చడం వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తవ్వకాల కారణంగా ఇళ్లకు పగుళ్లు, పశువుల మరణాలు, మనుషులపై రాళ్లు పడే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవల జరిగిన ఘటనలో బాంబు పేలుడు ప్రభావంతో పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మహిళలు, వృద్ధులు తీవ్రంగా భయపడుతున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ తవ్వకాలపై సంబంధిత అధికారులు మౌనం వహించడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది.గ్రామస్తుల ప్రాణభద్రతను లెక్కచేయకుండా సాగుతున్న ఈ అక్రమ గనులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మదనాపురం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిమదనాపురం ప్రజల ప్రాణాలను కాపాడాలి