అనంతగిరి గ్రామ పంచాయతీ 6వ వార్డ్‌లో హోరాహోరీ పోరు
కొద్దీ ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి రేపాకుల మౌనిక నరేష్‌కు పరాజయం
అనంతగిరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో 6వ వార్డ్‌లో జరిగిన త్రిముఖ పోరు తీవ్ర ఉత్కంఠభరితంగా సాగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రేపాకుల మౌనిక నరేష్ కొద్దీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
పోటీలో నిలిచిన ఇద్దరు హేమాహేమీ నాయకులకు గట్టి పోటీ ఇచ్చిన రేపాకుల మౌనిక నరేష్, ఒకానొక దశలో విజయం తనదేనని అనిపించే స్థాయిలో ముందంజలో నిలిచారు. అయితే చివరి క్షణాల్లో కేవలం 11 ఓట్ల తేడాతో గెలుపు అంచుల్లో నిలిచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
అయినప్పటికీ, రేపాకుల మౌనిక నరేష్ ప్రదర్శించిన పోరాట పటిమ, ధైర్యసాహసాలు అనంతగిరి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేకంగా రేపాకుల నరేష్, రేపాకుల సురేష్, గరిడేపల్లి సాయి గార్ల రాజకీయ చాకచక్యం ముందు ఇతర పార్టీలు ఈసారి గెలిచినప్పటికీ, అంతిమ విజయము వీరిదేనన్న భావన ప్రజల్లో బలంగా నెలకొంది అని స్థానికులు చెబుతున్నారు.