
ఫోటోషూట్ చిత్రం విశేషాలు
విశాఖపట్నం డిసెంబర్ 16 ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్ళకి ముందు ఫోటోషూట్స్ జరగడం సర్వసాధారణం గా జరిగే విషయం .అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే పరవాలేదు . కానీ ఏమాత్రం పెళ్లిళ్లు ఆగిపోతే , ఈ ఫోటో షూట్ వల్ల జరిగే కష్టనష్టాలను భరించడం చాలా కష్టం . ఒకోసారి జీవితాలు ముగించుకోవాలిసి వస్తుంది . జరిగిన కథ ఇతి వృత్తాన్ని ఆధారంగా తీసుకుని ఈ ఫిలిం చేయటం జరుగుతున్నదని కదా రచయిత కుప్పిలి రాంప్రసాద్ తెలియజేసారు . కథ వినగానే చాలా కొత్తగావుంది అనుదుకే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చానని ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఆలూరి రమేష్ బాబు తెలిపారు . ఇది ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికేవిధంగా వుంది . చాలా రోజులతరువాత తానూ మళ్ళీ డైరెక్షన్ చేయడానికి ఇంటరెస్ట్ కలిగిందని రాంప్రసాద్ గారు కథ చెప్పగానే అనుకున్నానని డైరెక్టర్ గంగాధర్ ప్రసాద్ తెలిపారు . ఈ చిత్రం డిసెంబర్ చివరివారం ప్రారంభించి , 2026 జనవరి 6 వ తారీకున విడుదలకు ప్లాన్ చేశానని , ఈ చిత్రం లో నటీనటులు అందరు విశాఖకు చెందినవారిని డైరెక్టర్ తెలిపారు . అనుభవం వున్న నటీ ,నటులు ఎవరన్నా నటించాలని ఇంటరెస్ట్ ఉంటే , 9059781543 నెంబర్ ను సంప్రదించమని తెలిపారు