logo

*||*ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు*||* *విజయనగరం అదనపు ఎస్పీ పి.సౌమ్యలత*




అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో డిసెంబరు 15న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత హాజరై, కీ॥శే॥లు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించి, మౌనం పాటించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ - భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను అర్పించి, అమరజీవిగా నిలిచిన మహానీయుడు శ్రీ పొట్టి శ్రీరాములన్నారు. మహాత్ముడు భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాములదన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ వెంట నడిచి, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారన్నారు. కుల, మతాల పట్టింపులు లేకుండా వ్యవహరించి, హరిజనులను దేవాలయంలోకి అనుమతించా లని నిరాహార దీక్ష చేపట్టారన్నారు. శ్రీరాములు నిరాహార దీక్షతో అప్పటి మద్రాసు ప్రభుత్వ హరిజనులను దేవాలయం లోకి అనుమతిస్తూ శాసనాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తిస్తూ నెల్లూరుజిల్లాకు 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసారన్నారు. అటువంటి మహానీయుడ్ని ఆయన వర్ధంతి రోజున స్మరించుకోవడం, నివాళులు అర్పించడం తెలుగువారిగా మనందరి బాధ్యతని జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, సిఐలు సత్యన్నారాయణ రెడ్డి, చంద్రశేఖర్, బి. లలిత మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి, మౌనం పాటించి, ఘనంగా నివాళులు అర్పించారు.

9
245 views