logo

కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ 'ప్రైవేటీకరణ' షాక్!

ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జి కదిరి బాబూ రావు, ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు (కె.కె. రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, మల్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, సిరమ్మ), ఎం.ఎల్.సి. వరుదు కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
భీమిలి నియోజకవర్గం నుంచి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, ఆయన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరు నియోజకవర్గాల నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ జి.వి.ఎం.సి. ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుండి మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వరకూ కొనసాగింది
ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) విధానం సరైనది కాదని ప్రజలు ఈ సంతకాల ద్వారా రుజువు చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పండుల రవీంద్రబాబు, మాజీ శాసన సభ్యులు, జియాన్ శ్రీధర్, డిప్యూటీ మేయర్ కటు మూరి సతీష్, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి - శ్రీనివాస, తదితర రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

36
1066 views