logo

ధర్మం తప్పని నాయకుడు: 'ఎక్కువ' జీతభత్యాలు వద్దు.. ప్రజా సంక్షేమానికే దానం!!!

నవీన్ పట్నాయక్ ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి... వీళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రే ఆయన పేరు బిజు పట్నాయక్... ధనవంతుల కుటుంబం వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా పనిచేసి మరణించిన తర్వాత 25 సంవత్సరాలు ఒడిస్సాకు ముఖ్యమంత్రిగా పని చేశారు.. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు... ఈయన 25 సంవత్సరాలు పరిపాలనలో ప్రజలకు మేకప్ వేసి ఏది చూపించలేదు... ఉన్నది చేశారు, పరిస్థితి వివరించారు.. 2015లో ఈయనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి మొత్తం దానం చేశారు.. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యే జీతభత్యాలు మిగతా సౌకర్యాలు అన్ని భారీగా పెంచారు.. ఈ చర్య ఈయనకు నచ్చలేదు కారణం అవి ఎక్కువ అని ఈయన భావన.. అందుకే ప్రభుత్వానికి ఉడతా సహాయంగా తనకు వచ్చే జీతభత్యాలు అన్ని పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలని సీఎం మోహన్ చరణ్ గారికి లేఖ రాశారు.. అలాగే ప్రతిపక్ష నేతగా లభించే ఆదాయాన్ని కూడా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని ఆయన లేఖలో తెలియజేశారు... ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో అలాగే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు.... చెప్పానుగా కొండకి వెంట్రుక కట్టి లాగే ప్రయత్నం చేయలేదు... రాష్ట్రానికి వచ్చే వనరులతోనే 25 సంవత్సరాలు పరిపాలించారు... ఇలాంటివారిని కూడా ఓడించేస్తున్నారు ఏం చేద్దాం...

2
78 views