logo

యువశక్తి-గ్రామశక్తి! "కార్పొరేట్ జాబ్ వదిలా... సర్పంచ్‌కు సై! సర్పంచ్ అభ్యర్థి దాసరి శ్రీనివాస్

పవర్ తెలుగు దినపత్రిక: భీమారం డిసెంబరు 11 యువశక్తి-గ్రామశక్తి!"కార్పొరేట్ జాబ్ వదిలా... సర్పంచ్‌కు సై! ఆదరించండి, అభివృద్ధి చేస్తా!"
ధర్మారం అభివృద్ధికి నాంది పలుకుతా - సర్పంచ్ అభ్యర్థి దాసరి శ్రీనివాస్ (ఉస్మానియా విద్యార్థి) పవర్ తెలుగు దినపత్రిక:భీమారం , డిసెంబరు 11 ధర్మారం గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో సంచలనం సృష్టిస్తున్న యువ అభ్యర్థి, రెడ్డిపల్లి గ్రామములో జన్మించి, ఉన్నత విద్యనభ్యసించిన దాసరి శ్రీనివాస్ (ఉస్మానియా విద్యార్థి) ఒక కీలక ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో తాను అందిన కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని గ్రామ సేవకు, అభివృద్ధికి ముందుకొచ్చానని ఆయన పేర్కొన్నారు ప్రజలు ఆదరించి, ఆశీర్వదిస్తే ధర్మారం గ్రామ పంచాయతీని కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతానని శ్రీనివాస్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారం సత్వర అభివృద్ధి లక్ష్యం నిత్యం ప్రజల మధ్యే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా, ఎన్నికల అనంతరం కూడా తాను నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు సుందర ధర్మారం సర్పంచిగా గెలిపించినట్లయితే గ్రామ పంచాయతీని అన్ని హంగులతో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని పారిశుద్ధ్యం, తాగునీరు వంటి మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు వార్డు సమస్యలు పరిష్కారం: ప్రతి వార్డులో పేరుకుపోయిన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి అన్ని సమస్యలను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొన్నారు యువ శక్తి - నూతన మార్పు: చదువుకున్న యువకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా గ్రామానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తన శక్తియుక్తులను వినియోగిస్తానన్నారు ఫుట్‌బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి ఈ నెల 17వ తేదీన జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతన మార్పుకు, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలబడే తమకు కేటాయించిన "ఫుట్‌బాల్" (⚽) గుర్తుపై ఓటు వేసి, తమను భారీ మెజారిటీతో గెలిపించాలని దాసరి శ్రీనివాస్ ధర్మారం గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
> దాసరి శ్రీనివాస్ నినాదం: "నాది నామమాత్రపు నాయకత్వం కాదు, నిత్యం మీ కోసం పనిచేసే నాయకత్వం. మీ ఆదరణే నా అభివృద్ధికి బలం."

0
0 views