
శ్రీ కొత్తూరు సుబ్బరాయునిలో ఆదివారం విశేష పూజలు: ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రాతఃకాల పూజలు, గందం అభిషేక పూజలు, రుద్రాభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మధ్యాహ్నకాల మహా నివేదన సమయంలో స్వామివారికి సర్ప సూక్తంతో సుగంధ ద్రవ్యాలతో, పంచామృత అభిషేకం, మహా రుద్రాభిషేకం, మహా నైవేద్యం, మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో యం.రామక్రిష్ణ, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తాదులందరూ విశేషంగా స్వామి వారిని దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తాదులందరికి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆదివారం మరియు మంగళవారాల లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.