logo

*​పదవికే వన్నె తెచ్చిన మహనీయులు అశోక్ గజపతి రాజు : ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు*


కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన శుభతరుణంలో, ఈరోజు అనగా 14.12.2025 దిన క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో "ఆత్మీయ సత్కార సభ"ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు హాజరై, అశోక్ గజపతి రాజు గారిని ఘనంగా సత్కరించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. అశోక్ గజపతి రాజు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. గోవా గవర్నర్‌గా ఆయన ఎంపిక కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు.
​పదవి ఆయనకు అలంకారం కాదు, ఆయనే ఆ పదవికి అలంకారం" అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత గవర్నర్ వ్యవస్థకు మరింత గౌరవాన్ని తెస్తుందని రఘురాజు ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

6
365 views