logo

*||కానిస్టేబుళ్ళుగా జిల్లా నుండి ఎంపికైన స్థానిక అభ్యర్థులు రేపు హాజరుకావాలి||* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*


కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్ళుగా ఎంపికైన స్థానిక పురుష, మహిళా అభ్యర్ధులు *రేపు అనగా డిసెంబర్ 15న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 5గంటలకు* హాజరుకావాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబర్ 14న ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ - కొత్తగా ఏర్పడిన విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్ళుగా ఎంపికైన స్థానిక పురుష, మహిళా అభ్యర్ధులు *విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద రేపు అనగా డిసెంబర్ 15న ఉదయం 5గంటలకు అభ్యర్ధితో పాటు మరొక ఇద్దరు (వారి తల్లితండ్రులు లేక వారి దగ్గర బంధువులైనటువంటి అక్క, అన్న లాంటి వారు) మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. హాజరయిన అభ్యర్ధులు, వారి కుటుంబసభ్యులకు పోలీసు వారే టిఫిన్ మరియు భోజనాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు.* పురుష అభ్యర్ధులు నీట్ షేవింగ్ మరియు కటింగ్ లో రావాలన్నారు. ఇక్కడ నుండి వారిన సురక్షితంగా విజయవాడ తీసుకువెళ్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 16న మంగళగిరి బెటాలియన్ లోని పెరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్ధులతో ముఖాముఖి నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తారన్నారు. అనంతరం అక్కడే అభ్యర్ధులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. తదుపరి అభ్యర్ధులను మరలా విజయనగరంకు తెసుకొని రావడం జరుగుంతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అభ్యర్ధులు తిరిగి వాళ్ళ సొంత ఊళ్లకు వెళ్లి, ఈ నెల 22 నుండి శిక్షణ ప్రారంభం కానుందని, కావున వారికి కేటాయించిన పిటిసి, డిటిసిలలో అభ్యర్ధులు ఈ నెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

16
882 views