logo

బంగారం కోసం గొంతు నులిమి హత్య

భోగాపురం మండలంలోని ఆర్అండ్ఆర్ కోలనీలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల అప్పయ్యమ్మను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని అపహరించారు. అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ వద్ద వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆర్ గోవిందరావు, సీఐ దుర్గా ప్రసాద్ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

8
321 views