ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..
*🟥 ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..*
గెజిట్ విడుదల
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు.ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణస్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు విడతల్లో ఎన్నికైన వారు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో 12,700 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.