
రాయలసీమలో పట్టుకోల్పోతున్న జనసేన
AIMA నంద్యాల న్యూస్. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ శనివారం రోజున నంద్యాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి ఐక్యతపై సందేహాలు తలెత్తాయి. అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినప్పటికీ, బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలోని సమన్వయం లోపం స్పష్టంగా కనిపించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికీ జనసేన పార్టీకి ప్రాధాన్యత కనబడలేదు.కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ లను కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ వారికి మరియు జనసైనికులకు తగిన గౌరవం దక్కలేదు. కనీసం వారిని వేదికపైకి కూడా ఆహ్వానించకపోవడం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దాదాపు రాయలసీమలో పరిస్థితి ఇలానే ఉంది సీమలో పట్టు కోల్పోతున్నామా అన్న సందేహం జన సైనికులకు కలుగుతుంది.
జనసేన పార్టీ ఆత్మగౌరవానికి భంగపాటుగా భావించిన నాయకులు రాచమడుగు చందు మరియు సుందర్, కార్యక్రమంలో ఎటువంటి నిరసనలు తెలియజేయకుండా, జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నేర్పిన నిబద్ధతను, క్రమశిక్షణ పాటిస్తూ వెనుతిరగడం జరిగిందని తెలిపారు.