
*ఐసిడిఎస్ హైర్ వెహికల్స్ డ్రైవర్ల న్యాయమైన పోరాటాలకి ఏఐటీయూసీ మద్దత్తు.*
*-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్*
ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా శనివారం ఉదయం విజయనగరం డిఆర్డిఏ మీటింగ్ హాలులో రాష్ట్ర సహాయ కార్యదర్శి గదుల సత్యన్నారాయణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఐసిడిఎస్ హైర్ వెహికల్స్ డ్రైవర్ మిత్రులందరికీ ఏఐటీయూసీ జిల్లా సమితి తరపున శుభాకాంక్షలు తెలియచేసారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రస్తుతం కేవలం 35 వేల రూపాయిలు అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న కానీ ఐసిడిఎస్ పరిధిలో అధికారుల కోసం ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎనలేని సేవలందిస్తున్న డ్రైవర్ల కష్టాలను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. డ్రైవర్ల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం తెలిసిన ప్రభుత్వ అధికారులకి డ్రైవర్ల బాధలు పట్టవా అని బుగత అశోక్ మండిపడ్డారు. సిడిపిఓ అధికారుల్లో కొంతమంది సొంత కార్లు ఉపయోగించి బిల్లులు డ్రా చేసుకుంటూ డ్రైవర్ల జీవనోపాధి మీద దెబ్బ కొట్టడం దుర్మార్గమన్నారు. డ్రైవర్ల పై జరుగుతున్న వెట్టి చాకిరీ విధానాల పై రాష్ట్ర వ్యాపితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న హైర్ వెహికల్ డ్రైవర్లు అందరూ సంఘటితమైతేనే గాని సమస్యలు పరిష్కారం చేసుకోగలమని అన్నారు. అందుకోసం రాష్ట్ర యూనియన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ యూనియన్ లో చేరి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటలకు సన్నద్ధం కావాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు. డ్రైవర్ల న్యాయమైన పోరాటాలకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మాదిరెడ్డి నరేంద్ర కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ సురేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్సులు పాల రామచంద్రరావు, అడిగర్ల అరుణ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్సులు గదుల సత్యనారాయణ, ఇళ్ళ అశోక్ బాబు, రాష్ట్ర కోశాధికారులు చప్పిడి బాలస్వామి, కె. రెహమాన్, రాష్ట్ర కమిటీ మెంబర్లు బి. హరిబాబు, వజ్రాల కుమార్, కొమ్మిది గంగాధర్, బయ్యవరపు హరిబాబు లు ప్రసంగించారు మరియు యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.