logo

మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: రూరల్ తహసీల్దారు శ్రీవాణి.

నంద్యాల (AIMA MEDIA ): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా మండల స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిస్కారం జరుగుతుంది అని రూరల్ తహసీల్దార్ శ్రీవాణి ఓ ప్రకటనలో తెలియజేసారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు ప్రతి సోమవారం జిల్లా కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదని, ప్రజలకు అందుబాటులో ప్రతి సోమవారం రూరల్ తహసిల్దార్ కార్యాలయంలోనే సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలు రూరల్ తహసీల్దారు కార్యాలయం లోని అధికారులకు నేరుగా సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇవ్వాలని కోరారు. సమస్యలకు పరిష్కారం లభించకపోతే నంద్యాల ఆర్డీవో, జిల్లా అధికారులకు అర్జీ పెట్టుకోవచ్చు అన్నారు.ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని తహసిల్దారు శ్రీవాణి తెలిపారు.

5
718 views