logo

పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

*పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య*


పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేటలో చోటుచేసుకుంది


. చందన జ్యోతి, యశ్వంత్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.

అయితే పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

4
235 views