logo

ఐఏఎస్‌లకు హైకోర్టు షాక్: కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన మాజీ, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు నోటీసులు

సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలు ఇవ్వనందుకు.. గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు ఇద్దరు ఐఏఎస్‌ (IAS) అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కె. ఇలంబర్తి, ఆర్.వి. కర్ణన్‌లపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి భీమపాక నగేశ్ ప్రశ్నించారు. జనవరి 26 లోపు కౌంటర్ దాఖలు చేయకుంటే రూ. 10 వేల జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

4
134 views