logo

భద్రాచలం నుండి పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడి కి ప్రత్యేక రైలు నడపండి *సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి నెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** డిసెంబర్ 12** ఏఐఎంఏ మీడియా ప్రతినిధి


భద్రాచలం నుండి పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడి కి ప్రత్యేక రైలు నడపండి

*సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి (DRUCC) నెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి


కొత్తగూడెం, డిసెంబర్ 12 ( ప్రతినిధి)
పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి కృషితో మంజూరైన రైల్వే స్టేషన్ ముందు నుండి న్యూ గొల్ల గూడెం వరకు రోడ్డు వెడల్పు పనులకు క్లియరెన్స్ తక్షణమే ఇవ్వండనీ.
కరోనాలో రద్దు చేసిన బెల్గావి, డోర్నకల్, కాజీపేట రైళ్లను తక్షణం పునరుద్ధరించండనీ
కొత్తగూడెం టు కొవ్వూరు రైల్వే లైన్ పూర్తి చేసి కొత్తగూడెంలో రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలనీ
రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదిన పూర్తి చేపించాలని
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాత్సవను శుక్రవారం నాడు కలిసి వినతిపత్రం అందించిన సౌత్ సెంట్రల్ రైల్వే డి ఆర్ యు సి సి మెంబర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు.
భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్ సందర్శన మరియు పుణ్యక్షేత్రమైన భద్రాచలం పర్యటనకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి (DRUCC) నెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కలిసి స్వాగతం పలికి ఘనంగా సత్కరించి పలు రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది,
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి పలు రైల్వే సమస్యలను జిఎం దృష్టికి తీసుకు వెళుతూ...కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు గత మూడు సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నాయని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు . ఈ ప్రాంత ప్రజలు భక్తుల కోరిక మేరకు భద్రాచలం నుండి కలియుగ దైవమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి మరియు షిరిడీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తామని గతంలో రైల్వే అధికారులు ఇచ్చిన హామీని నిల బెట్టుకొని వెంటనే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కరోనా నేపథ్యంలో రద్దు చేసిన బెల్గావి ఎక్స్ప్రెస్ ను, మరియు డోర్నకల్- కాజీపేట ప్యాసింజర్ రైళ్లను తక్షణం పునరుద్ధరించి ఈప్రాంత ప్రజలకు రావాణ సౌకర్యం కల్పించాలని . అదేవిధంగా ఇటు కొవ్వూరు రైల్వే లైన్ ను అటు భద్రాచలం నుండి చత్తీస్గడ్ మీదుగా ఒరిస్సా లోని కిరణ్ డోల్ వరకు రైల్వే లైన్లు పూర్తిచేసి కొత్తగూడెం సెంటర్ గా రైల్వే జంక్షన్ ఏర్పాటు చేసి కొత్తగూడెం ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చెప్పారు. డోర్నకల్ నుండి కొత్తగూడెం వరకు జరుగుతున్న డబుల్ రైల్వే లైన్ పనులను తక్షణమే పూర్తి చేపించాలని, కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుండి న్యూ గొల్లగూడెం వరకు రోడ్డు విస్తరణ కోసం కావలసిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామ సహాయం రఘురాం రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇండియన్ రైల్వే అధికారులు సమ్మతించడం జరిగిందని దీనికి బదులుగా ఖమ్మంలో ప్రభుత్వ స్థలాన్ని రైల్వే స్టేషన్ విస్తరణ పనులకు కేటాయించడం జరిగిందని కాబట్టి న్యూ గొల్లగూడెం రోడ్డు విస్తరణ పనులకు క్లియరెన్స్ వెంటనే ఇప్పించి కొత్తగూడెం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కొత్తగూడెం నడి బొడ్డున రాజీవ్ పార్కు మరియు ఎన్జీవోస్ కాలనీకి అడ్డంకిగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద గత అనేక సంవత్సరాలుగా ఉన్న రహదారిని తిరిగి పునరుద్ధరణ చేపించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను సావధానంగా స్వీకరించిన జిఎం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ జిఎం దిశా కమిటీ సభ్యులు ఆనందరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీకాంత్, ఎం.రామకృష్ణ మరియు కొత్తగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కోదుమూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ కంభం పాటి రవి, జాయింట్ సెక్రెటరీ పల్లపోతు సాయిబాబా మరియు సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణయ్య, సెక్రటరీ టు జి ఎం మల్లాది శ్రీనివాస్, సీనియర్ డిసిఎం సిఫాలి, మరియు ఏరియా ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, ఇన్స్పెక్టర్ పాషా, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

75
3340 views