
* రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*
విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి దగ్గరలో రాత్రి సుమారు 7 గంటల సమయంలో బైక్ ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడిన ఒక మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబరు 12న సపర్యలు చేసి, అటుగా వస్తున్న ఆటోలో దగ్గరుండి ఎక్కించి వెంటనే దగ్గరలో ఉన్న నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబరు 12న గరివిడిలో జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర కార్యక్రమం లో పాల్గొని తిరిగి గరివిడి నుండి విజయనగరం వస్తున్న సమయంలో గుర్ల గ్రామం దగ్గర దుగ్గివలస గ్రామానికి చెందిన దంపతులు బైకుపై విజయనగరం నుండి దుగ్గివలస గ్రామం వస్తున్న సమయంలో బైకు ప్రమాదానికి గురై రహదారిపై పడిపోవడంతో, వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడినట్లుగా గమనించారు. వెంటనే, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళకు సపర్యలు చేసి, మంచినీరు అందించి, ఆమెకు, తన భర్త కు ధైర్యం చెప్పి వెంటనే అటుగా వస్తున్న ఆటోను ఆపి గాయపడిన మహిళను ఆటోలోకి స్వయంగా ఎక్కించి దగ్గరలో ఉన్న నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ గారి వెంట ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు కూడా వున్నారు. అనంతరం స్థానిక ఎస్ఐ మరియు సిఐకు సమాచారం అందించి వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు