
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి,
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలీ...CITU,AITUC.
నంద్యాల::అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు, ఎఐటియుసి అంగన్వాడి యూనియన్ల ఆధ్వర్యంలో నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ అనంతరం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పలు సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న 1810 మినీ సెంటర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్ లగా మార్చాలని హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈరోజు సిఐటియు ఎఐటియుసి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ లు రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాతీయ రహదారిపై దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాలకు సిఐటియు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శోభారాణి ఎం నిర్మల సిఐటియు జిల్లా అధ్యక్షులు వి ఏసురత్నం జిల్లా కార్యదర్శులు వి బాల వెంకట్ డి లక్ష్మణ్ వెంకట లింగం జిల్లా ఉపాధ్యక్షులు కే యం డి గౌస్ సీనియర్ నాయకులు తోట మద్దులు ఎఐటియుసి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జులేకాబి, వసుంధర, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య రాష్ట్ర నాయకులు రమేష్ శ్రీనివాసులు, నాగరాముడు సీతామహాలక్ష్మి ల నాయకత్వంలో ఈ ర్యాలీ ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వేతనాలు పెంచాలని రాష్ట్రంలో 46807 మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చినప్పటికీ వారికి ఇంతవరకు పెరిగిన వేతనాలు ఇవ్వలేదని ఆ వేతనాలు వెంటనే ఇవ్వాలని ఇంకా మిగిలిన 1810 మినీ సెంటర్లను క్వాలిఫికేషన్ లేదనే పేరుతో మెయిన్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చెయ్యలేదు పదవ తరగతి పాసైన సెంటర్లను కూడా అప్ ది గ్రేట్ చేయలేదు అని వీటిని వెంటనే మెయిన్ సెంట్రల్ గా మార్చాలని గ్రాడ్యుయేట్ జీవో నెంబర్ 8కు సుప్రీంకోర్టు తిరుపతి ప్రకారం గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు హెల్పర్ల ప్రమోషన్లు రాజకీయ జోకాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు . ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడి సెంటర్లను విలీనం చేయాలనే ప్రభుత్వం నిర్ణయం అంగన్వాడి సెంటర్ లకు నష్టం చేస్తుందని అంగన్వాడీల సెంటర్లను కుదించే ప్రమాదం ఉంటుందని వెంటనే ఫ్రీ స్కూల్ విద్య విడిగా కొనసాగించాలని అంగన్వాడీ బలోపేతం కోసం ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని ఐసిడిఎస్ స్థాపన లక్ష్యానికి విరుద్ధంగా యాప్ పేరుతో పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు దూరం చేసే చర్యలు వ్యతిరేకించాలని ఐసిడిఎస్ కేంద్ర ప్రభుత్వం అరకురా నిధులు కేటాయించడం వల్ల మాతో మరణాలు శిశు మరణాలు తగ్గించడం చాలా మందకోడిగా సాగుతుందని పోషకాహారం తగినంతగా అందక ఇంకా గణనీయమైన శాతం లో పిల్లలు ఎదుగుదల లోపంతో తక్కువ బరువుతో ఉంటున్నారని నిధుల కొరత వలన లబ్ధిదారుల లిస్టును తగ్గించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని తగిన స్థాయిలో నిధులు పెంచాలని 2019 నుండి వేతనాలు పెరగనందు వల్ల అంగన్వాడీల వేతనాల సమస్య పరిష్కారం కోసం 2023 డిసెంబర్ 42 రోజుల్లో సమ్మె నిర్వహించినప్పుడు అప్పటి ప్రభుత్వం 2024 జులైలో వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అప్పుడు ప్రతిపక్షంగా ఉండగా తాము 2024 లో అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని వాగ్దానం చేసి ఇప్పటికీ సంవత్సరం నర దాటుతున్నప్పటికీ అదిగో పెంచడం ఇదిగో పెంచుతాం అని చెప్పడం తప్ప ఆచరణలో వేతనాలు పెంచలేని ఈ ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి నిర్మలమ్మ రమణమ్మ నాగరాణి మంజుల హరిత శివలక్ష్మి ప్రసన్న నరసమ్మ రాజ్యలక్ష్మి సరస్వతి ఏఐటియుసి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు చంద్రకళ జూలై కాబి వసుంధర ఎస్తేరు సుజాత సీతామాలక్ష్మి తో పాటు జిల్లా వ్యాప్తంగా రెండు వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు
డిమాండ్-:
1)అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి.
2), పెండింగ్ లో ఉన్న 18 వర్కర్లను క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంట్రల్ గా మార్చాలి.
3), హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలి.
4), అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
5), అన్ని యాప్ లు కలిపి ఒకే యాప్ గా మార్చి సెంటర్ల నిర్వహణకు 5g ఫోన్లు ఇవ్వాలి ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలి.
6), గ్రాడ్యుటి అమలకు గైడ్లైన్స్ రూపొందించాలి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలి.
7), పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
8), లబ్ధిదారులకు ఆయిల్ కందిపప్పు క్వాలిటీ పెంచాలి మెనూ ఛార్జీలు పెంచాలి ఉచితంగా గ్యాస్ సర్ఫరా చేయాలి
8), ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలి ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడి సెంటర్ లో ఉండాలని జీవో ఇవ్వాలి ప్రీస్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.