logo

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 27 మందికి జరిమానా, ఇద్దరికి జైలుశిక్ష* *- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్.*


విజయనగరం పట్టణంలో ఇటీవల చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 29 మందిని కోర్టులో హాజరుపరచగా 27 మందికి ఒక్కొక్కరికి రూ.10,000లు జరిమానా, ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ అడిషనల్ జుడిష్యల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. ఎస్. హెచ్. ఆర్. తేజ చక్రవర్తి డిసెంబరు 11న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు జిల్లాలో ఆకస్మికంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇటీవల పట్టణంలో విజయనగరం ట్రాఫిక్ సిఐ సిహెచ్. సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 29 మందిని కోర్టులో హాజరుపరచగా 27 మందికి ఒక్కొక్కరికి రూ.10,000లు జరిమానా చొప్పున రూ.2,70,000లు, ఇద్దరికి జైలుశిక్ష (ఒకరికి 4 రోజులు, మరొకరికి 9 రోజులు) విధిస్తూ అడిషనల్ జుడిష్యల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. ఎస్. హెచ్. ఆర్. తేజ చక్రవర్తి గారు డిసెంబరు 11న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

0
0 views