logo

వెల్లంకిలో ప్రజాదర్బార్‌ సందడి – వినతులు స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు, డిసెంబర్ 12 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమం జనసంచారం నడుమ జోరుగా సాగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యేతంగిరాల సౌమ్య హాజరై ప్రజల నుండి నేరుగా వినతులుస్వీకరించారు. గ్రామస్తులు తాగునీరు,రహదారి మరమ్మతులు, విద్యుత్ అంతరాయం, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే సౌమ్య… “కూటమి పాలనలో ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం. అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతి వినతిపై జవాబుదారీతనం చూపాల్సిందే” అని అధికారులు స్పష్టం చేశారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభ్యర్థనలు, సూచనలు పంపించారు. వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి స్పందించిన ఎమ్మెల్యే సౌమ్యకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్‌, శాఖాధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

8
233 views