
రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే జేఎమ్ఆర్ కదిలిస్తేనే అధికార యంత్రాంగం కదిలింది
ఎన్టీఆర్ జిల్లా నందిగామ డిసెంబర్ 12 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
నందిగామ టౌన్ :పత్తి–అపరాల కొనుగోళ్లలో జరుగుతున్న లోపాలను వెలికి తీస్తూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు చేసిన నిలదీత తర్వాతే ప్రభుత్వ వ్యవస్థ కదలికలోకి వచ్చిందని స్థానిక నాయకులు ధ్వజమెత్తారు. నందిగామ, కంచికచర్ల మార్కెట్ యార్డులను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించి కొనుగోలు వ్యవస్థ లోని వైఫల్యాలను ఎత్తిచూప డంతో అధికారులు అప్రమత్తమ య్యారని వారు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే స్పందించిన తర్వాతే ముఖ్యమంత్రి కిసాన్ కపాస్ యాప్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, అలాగే పత్తి కొనుగోలు అంశంపై కేంద్రానికి లేఖ సిద్ధం చేయాలని ఆదేశించారని నాయకులు గుర్త చేశారు. అంతేకాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు కూడా రైతుల సమస్యలను మాజీ ఎమ్మెల్యే ప్రస్తావన తరువాతే ప్రచురించాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ కాలంలో జగన్మోహనరావు చేసిన కృషి వల్లనే సుబాబులకు గిట్టుబాటు ధర లభించిందనే విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని వారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంచికచర్ల మార్కెట్ యార్డులో ఎంత పత్తి, అపరాలు కొనుగోలు జరిగాయో చైర్మన్ సమాధానం చెప్పలేకపోవడం వారి అజ్ఞానాన్ని వెల్లడించిందని విమర్శించారు. రైతుల సమస్య లపై స్పందించాల్సిన ప్రస్తుత ఎమ్మెల్యే ఎక్కడో కనిపించరని, ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మార్తా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గుడేటి శ్రీనివాసరావు,నందిగామ మండల అధ్యక్షులు మంచాల చంద్రశేఖర్, సీనియర్ నాయకులు YSN ప్రసాద్, కంచెటి లక్ష్మినారాయణ, గడిపూడి నాగేశ్వరావు పాల్గొన్నారు.