logo

ఏపీఎన్జీజీవో బొబ్బిలి యూనిట్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక.

ఎ.పి.ఎన్.జి.జి.ఒ. తాలూకా యూనిట్ బొబ్బిలి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం ఎన్జిఓ హోమ్ లో జరిగింది.ఈ ఎన్నికలకు సంబందించి మొత్తం 15 పోస్టులు గాను ప్రెసిడెంట్ -1, సెక్రటరీ-1, కోశాధికారి-1, అసోసియేట్ ప్రెసిడెంట్ -1, ఆర్గనైజింగ్ సెక్రటరీ -1, వైస్ ప్రెసిడెంట్ లు-4, జాయింట్ సెక్రెటరీ లు -4, వుమన్ వైస్ ప్రెసిడెంట్ -1, మరియు వుమన్ జాయింట్ సెక్రెటరీ -1 మొత్తం 15 పోస్టులు కు సంబందించి,ఉదయం 10.00 గంటల నుండి నామినేషన్ కార్యక్రమము జరిగింది.ఎ.పి.ఎన్.జి.జి.ఒ. తాలూక యూనిట్ బొబ్బిలి పరిధి లో గల బొబ్బిలి అర్బన్ మరియు రూరల్ మరియు రామభద్రపురం మండలములలో గల గజిటెడ్ మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.అధ్యక్షుడిగా మెడికల్ డిపార్ట్మెంట్ కు చెందిన బి బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా బొబ్బిలి పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ చుక్క శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 13 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల అనంతరం కొత్త కార్యవర్గ సభ్యులందరూ కలసి, మిగిలిన సభ్యులతో బొబ్బిలి-పార్వతీపురం రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం కొత్త సభ్యులందరి చేత ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.

0
192 views