
హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అనే ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడంలో భాగంగా,
హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అనే ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడంలో భాగంగా, హిందూపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఆమోదం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ, ప్రత్యేక జిల్లా సాధన కోరి, హిందూపురం మున్సిపల్ మేనేజర్ శ్రీ సుధాకర్ గారికి హిందూపురం జిల్లా సాధన కమిటీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిని మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ శ్రీ సుధాకర్ గారు మాట్లాడుతూ, “హిందూపురం పట్టణాన్ని జిల్లా లేదా జిల్లాకేంద్రంగా చేయాలనే ప్రజల వినతిని ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను” అని హామీ ఇచ్చారు.
సమర్పించిన వినతిపత్రంలో హిందూపురం భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు, ప్రజాసంఖ్య, ఆర్ధిక స్థితి, ప్రభుత్వ కార్యాలయాల అవసరం వంటి అంశాలను వివరంగా ప్రస్తావించారు. ప్రజల సౌకర్యాలు, పట్టణ అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, ప్రాంతీయ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా ప్రకటించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో అధ్యక్షుడు ఇందాద్, ఉపాధ్యక్షుడు బాబావలి, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, కార్యదర్శి నూర్ మహమ్మద్, ఫరూఖ్ ఖాన్, శంకర్, రవికుమార్, నరసింహమూర్తి, ఇమ్రాన్, ఇంతియాజ్, న్యాయవాదులు ఉదయసింహ రెడ్డి, అతీక్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.