ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇకనుండి మీ సమస్యలకు మీ మండలంలోనే పరిష్కార వేదిక నిర్వహణ.
రుద్రవరం:: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇకనుండి ఆయా మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం మరియు గ్రామ వార్డు సచివాలయంలోనే నిర్వహించుకునేలా ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఇచ్చుకునే విధంగా కార్యాచరణ చేయటం జరిగిందని రుద్రవరం తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రవరం మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని అలాగే స్థానిక గ్రామ అవార్డు సచివాలయంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సిటిజన్ లాగిన్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకుని సదుపాయం కల్పించబడిందని, అలాగే కాల్ సెంటర్ నెంబర్ 1100 కు కాల్ చేసి మీ సమస్యను తెలియజేయడం ద్వారా కూడా ఆన్లైన్ నందు నమోదు చేసుకోవచ్చని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా రుద్రవరం తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ తెలిపారు.