logo

మహారాష్ట్ర ఔరంగాబాద్ నందు ప్రపంచ మానవాక్కుల మండలి వార్షికోత్సవం అవార్డుల ప్రధానోత్సవం

డిసెంబర్ 10, మహారాష్ట్ర, ఔరంగాబాద్: హజ్ హౌస్ నందు ప్రపంచ మానవ హక్కుల మండలి 77వ వార్షికోత్సవ సందర్భంగా అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమమునకు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రపంచ మానవ హక్కుల మండలి కార్యవర్గ సభ్యులు ప్రముఖులు విచ్చేశారు. విద్య, వైద్య, వ్యాపార , జర్నలిజం, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, రచయితలు, ఉత్తమవిద్యార్థిని, విద్యార్థులకు మరియు సైనికులు, పోలీసులకు, వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి, ప్రపంచ మానవ హక్కుల కార్యవర్గ సభ్యులకు మెమొంటోలతో పాటు సర్టిఫికెట్లను మెడల్స్ ను అందజేశారు. కార్యక్రమంలో ఉత్తమ బాల బాలికలకు సర్టిఫికెట్లు మెడల్స్ ను అందజేయడం జరిగినది. జాతీయ అధ్యక్షులు అన్సారి మాట్లాడుతూ మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడడంలో నేను నాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కార్యవర్గ సభ్యులందరూ కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తారని తెలియజేశారు. అదేవిధంగా నేపాల్ దేశం నుండి వచ్చిన ప్రపంచ మానవ హక్కుల మండలి మహిళ కార్యదర్శి నీతూ కోయిరాలా హక్కుల కోసం కులం, మతం, ప్రాంతం, భాష, జాతి మరియు రంగు, లింగ భేదాలు లేకుండా సాటి మనిషిని గౌరవించాలని ఆపదలో ఉంటే ఆదుకోవాలని తెలిపారు. సైనిక కర్నల్ నిర్దేశ్ తమ సైనికులతో విచ్చేసి మానవ హక్కులపై దిశా నిర్దేశము సూచించారు.
ప్రజల ఆపద సమయాలలో తమ ప్రతిభను కనబరిచిన సైనికులకు మెమొంటోలతో పాటు సర్టిఫికెట్లను మెడల్స్ ను అందజేశారు., జాతీయ ఉపాధ్యక్షులు ఆన్సర్ ఉల్ హక్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, కల్పించిన హక్కులకు భంగము వాటిల్లితే తమ వంతు పాత్ర పోషించి పోరాటం సాగిస్తామని తెలిపారు.
సభకు విచ్చేసి అధ్యక్షత వహించిన మాజీ జడ్జీలు ప్రభుత్వ అధికారులు హక్కుల గురించి రాజ్యాంగం గురించి సవివరంగా వివరించారు. డాక్టర్ ఫిరోజ్ ఖాన్ ప్రసంగిస్తూ మానవుని యొక్క విలువలను చక్కగా వివరించి సభను ఆకట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్, అహమదుల్లా నజీర్,జుల్ఫికర్, అన్వర్, విష్ణు కాంత్, అంకిపల్లి శివకుమార్, అల్తాఫ్, దక్షిణ భారతదేశపు మీడియా కార్యదర్శి అబ్దుల్ సుభాన్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సయ్యద్ మెహతాజ్ బేగం, పర్వీన్, వనిత, దేవి,రాధా మరియు ప్రపంచ మానవ హక్కుల మండలి కార్యవర్గ సభ్యులు విచ్చేశారు. తదుపరి ప్రపంచ మానవ హక్కుల మండలి కార్యవర్గ సభ్యులు వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన వారందరికీ మెమొంటోలతో సర్టిఫికెట్లతో మెడల్స్ తో సత్కరించారు.
చివరగా సభ మొత్తము జాతీయగీతమును ఆలపించి ముగించారు.

26
115 views