logo

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి చందనదీక్ష ప్రారంభం....

విశాఖపట్నం (సింహాచలం)

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం నందు,బుధవారం స్వామివారి రెండువ విడత చందన దీక్ష వైభవంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా వందలాది మంది భక్తులుకు చందన మాలాధారణ చేశారు.

దీక్షా స్వాములకు చందన దీక్షా మాలలను దేవస్థానం ఈవో శ్రీమతి ఎన్. సుజాత ఆదేశాల మేరకు ఆలయ స్థానాచార్యుల వారి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు ఆధ్వర్యంలో, పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన మరియు పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి స్థానాచార్యులు డాక్టర్ టి పి, రాజగోపాల్ సహాయ కార్య నిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు,పర్యవేక్షణ అధికారి కంచి మూర్తి,ప్రధానార్చకులు,అర్చక బృందము,వేద పండితులు,నాదస్వర బృందము మరియు ఇతర సిబ్బందితో కలిసి స్వామి వారి సన్నిధి నుండి మాడ వీధులలో ఊరేగింపుగా ప్రదక్షిణ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.చందన మాలాధారణ అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

0
121 views