
YSRCP కాంగ్రెస్ పార్టీ డివిజన్ పార్టీ కమిటీ, అధ్యక్షుల నియామకం
విశాఖపట్నం(గాజువాక) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డివిజన్ పార్టీ కమిటీలో మరియు డివిజన్ అనుబంధ విభాగ అధ్యక్షులుగా నియమించడమైనది.85 వార్డు ఫిర్యాదుల కమిటీ జనరల్ సెక్రెటరీ ఎల్లపు పెంటారావును నియమిస్తున్నట్టు విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు తెలియజేశారు.కేకే రాజు మాట్లాడుతూ పార్టీ గురించి శ్రమించే ప్రతి ఒక్క కార్యకర్తకు అభిమానులకు ఎల్లప్పుడూ పార్టీ అండదండలుగా ఉంటుందని తెలిపారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్న రెడ్డి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎల్లపు పెంటారావు ప్రభుత్వ ఐయామ్ లోనే కాకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్న సరే ప్రజలకు ఎల్లవేళలా సేవలు చేస్తున్నందుకు పార్టీ అధిష్టానం గుర్తించి పదవి ఇవ్వడం జరిగినది.85 వార్డ్ ఇంచార్జ్ పూర్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన పార్టీకి ఎప్పుడు అండదండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న ఎల్లపు పెంటారావుని పార్టీ అధిష్టానం నియమించినందుకు ఆయన సేవలు మరింత అభివృద్ధి చెంది పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఎల్లపు పెంటారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి,85వ వార్డు అధ్యక్షులు పూర్ణ, ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.ప్రజల్లో అందుబాటులో ఉంటూ జీవీఎంసీ సమస్యల పైన అధికార పార్టీని నిలదీసి సమస్యలను త్వరితగతిన పూర్తయ్యే విధంగా నా సాయి శక్తుల శ్రమిస్తానని పార్టీ పెద్దలందరికీ,వార్డు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు,ధన్యవాదాలు తెలిపారు.