logo

హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ చందును మర్యాదపూర్వకంగా కలిసిన హెచ్ ఆర్ సి ఐ సభ్యులు

హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ చందును మర్యాదపూర్వకంగా కలిసిన హెచ్ ఆర్ సి ఐ సభ్యులు

క్రౌన్ హ్యూమన్ రైట్స్ విజయవాడ డిసెంబర్ 10;

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మాదాసు చారేంద్ర సలహా మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థలో నూతనంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి కందుల చందును హెచ్ఆర్సిఐ కుటుంబ సభ్యులు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించినటువంటి చందు మాట్లాడుతూ ఈ సంస్థలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా సంస్థను అభివృద్ధి చేసే విధంగా మరియు సమాజంలో మన సంస్థకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సభ్యులు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఈ సమాజంలో మానవ హక్కులకు విలువ లేకుండా ఎవరికి అధికార బలం ధన బలం ఉందో వారే రాజ్యం ఏలుతున్నారు సామాన్యులకు దొరకని హక్కులను హెచ్ఆర్సిఐ వారికి అందే విధంగా చూడాలని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని ఎవరికీ చెవితే న్యాయం జరిగిందో తెలియక ఎంతోమంది ఎదురుచూస్తున్నారని అటువంటి వారిని మనం కలిసి మన సంస్థ వల్ల వారికి న్యాయం జరిగేలా చూస్తే ఈ సంస్థకి ఈ సంస్థలో ఉన్న మనకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఉమెన్ పోర్టు ప్రెసిడెంట్ కోన వరలక్ష్మి, సౌత్ ఇండియా సభ్యులు గద్దె రాజ్యలక్ష్మి, కె విజయమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమెన్ పోర్టు ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ షహనాజి మరియు ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ భవాని, శివ, మరియు తదితరులు పాల్గొన్నారు.

5
1635 views