పరకామణి చోరీపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పరకామణి చోరీపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. "ఐదేళ్లుగా సీఎంగా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడకూడదు. అదే ఇస్లాం, క్రైస్తవం విషయంలో కూడా ఇలాంటివి జరిగి ఉంటే.. చిన్న విషయమే అని జగన్ కొట్టిపారేసేవారా? హిందువుల విషయానికి వచ్చేసరికి ఇష్టానుసారం మాట్లాడతారా? హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోంది." అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.