logo

వార్డ్ అభ్యర్థి - ఐదు కోట్ల పనులకు హామీ - 12వ వార్డులో కోటి రూపాయల పనులకు భరోసా - బుగ్గారంలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయాలు

వార్డ్ అభ్యర్థి - ఐదు కోట్ల పనులకు హామీ

- 12వ వార్డులో కోటి రూపాయల పనులకు భరోసా

- బుగ్గారంలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయాలు

బుగ్గారం / జగిత్యాల జిల్లా : ( డిసెంబర్ 10, పున్నమి ప్రతినిధి) :

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని 12 వ వార్డ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఐదేండ్లలో గ్రామానికి ఐదు కోట్ల అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు.
తాను పోటీ చేస్తున్న 12వ వార్డులో రెండేండ్ల లోపు ఒక కోటి రూపాయల అభివృద్ధి పనులు చేసి క్లిష్టమైన ప్రజా సమస్యలు తీరుస్తానని వార్డ్ ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు.

గత పాలకులు పడమటి వాడపై పగ బట్టి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆయన ఆరోపించారు. పడమటి వాడ ప్రజల సమస్యలు వర్ణనాతీతం అన్నారు. అందుకే ఈప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితిలో తాను వార్డ్ సభ్యునిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే వార్డు ప్రజలకు, గ్రామానికి తాను చేయబోయే పనుల పూర్తి వివరాలను విలేఖరుల సమావేశంలో ఒక కరపత్రం ద్వారా ప్రకటిస్తానని చుక్క గంగారెడ్డి బుధవారం విలేఖరులకు తెలిపారు.

13
771 views