సుజాతనగర్‌లో యువతి హత్య: 24 గంటల్లో నిందితుడు అరెస్ట్!
పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో కొట్టి చంపి పరారైన వ్యక్తిని పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ 6 నెలలుగా సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. డబ్బుల కోసం దేవీతో గొడవపడి చంపాడు. కాగా రైస్ పుల్లింగ్ వంటి పలు నేరాల్లో శ్రీనివాస్‌పై ఇప్పటికే కేసులున్నాయి.