ప్రథమనందీశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3,49,365.
నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా పరిధిలోని ప్రథమనందీశ్వరస్వామి ఆలయంలో ఈవో చంద్రుడు ఆధ్వర్యంలో దేవా దాయశాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చలంబాబు సమక్షంలో డిసెంబర్ 9వతేది మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.3,49,365 ఆదాయం వచ్చినట్లు ఈవో చంద్రుడు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవా దాయశాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చలంబాబు, కృష్ణారెడ్డి, నాగరాజు, నారపురెడ్డి, అర్చకులు ప్రవీణ్శర్మ, భక్తులు పాల్గొన్నారు.