logo

రాజాం: ఆటోని ఢీ కొట్టిన బస్సు

రాజాం-పాలకొండ రోడ్డులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పాసింజర్ ఆటో రోడ్డుమీదకు రావడంతో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. అయితే ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ఆటోని పైకి లేపడంలో సహాయం చేశారు

16
545 views