
ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ వారికి అరుదైన గౌరవం
AIMA నంద్యాల జిల్లా న్యూస్. ఖూన్ కా రిస్తా చారిటబుల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా కడప పట్టణంలో ఆదివారంనాడు రక్తదానంలో సేవలందిస్తున్న రక్తదాతలకు స్వచ్ఛంద సేవకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ ను ఘనంగా సత్కరించారు. అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో లేక బాధపడుతున్న వారికి సకాలంలో రక్తం అందేలా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నందుకు గాను ట్రస్ట్ నిర్వాహకులు మహమ్మద్ హుస్సేన్ సేవలను ప్రశంసించారు. ఆళ్లగడ్డ, పరిసర గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలను సమన్వయం చేసి అనేక మందికి ప్రాణదానం చేసిన సేవలు అభినందనీయమని ట్రస్టు నిర్వాహకులు కొనియాడారు.ఈ సందర్భంగా మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం. ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. ఇదే నిజమైన మానవత్వం అని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, వైద్యులు, రక్తదాతలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలిపారు. ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తికి కడప జిల్లా కేంద్రంలో ఈ విధమైన గౌరవం దక్కడంతో ఆనందం వ్యక్తం చేసిన నియోజకవర్గ ప్రజలు యువకులు.