అదనపు కలెక్టర్ ఇంట్లో ఎసీబీ అధికారులు తనిఖీ
జర్నలిస్ట్: ఆకుల గణేష్
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, భారీగా నగదు, భూమి పత్రాలు బయటపడ్డాయి. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అదనపు కలెక్టర్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. హన్మకొండలోని ఆయన నివాసంలో రూ.30 లక్షల 30 వేల నగదు, భూమి పత్రాలు, లాకర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు